- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhuyashki: తెలంగాణ రాకుంటే కవిత బ్యూటీపార్లర్ పెట్టుకునేది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కవిత బీజేపీ (BJP) వదిలిన బాణం అని ఆమె కేసీఆర్ కు లేఖ రాయడం వెనుక బీజేపీ ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ వ్యూహ రచనలో భాగంగానే కేసీఆర్ కు కవిత లేఖ రాసిందన్నారు. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడిన మధుయాష్కి గౌడ్ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే కవిత (Kavitha) పనిచేస్తోందన్నారు. కవిత లేడీ మాఫియా డాన్ అని అమె చేయని దందా, స్కాం లేదని ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ మరింత బలోపేతం అవుతుందనేది మోడీ అంచనా అని మరో వైపు లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడేందుకు కవితకు బీజేపీ మద్దతు అవసరం అని చెప్పారు. కవిత జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామి ఉందన్నారు. ఆమె రూ. 800 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూడా భాగస్వామి అని ఈ స్కాంకు సంబంధించిన చర్చలు ప్రగతి భవన్ లోనే జరిగాయని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.
అవినీతి సొమ్ము కోసమే జాగృతి:
బతుకమ్మ పేరుతో కవిత బతుకనేర్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాగుడు వల్ల ఆడబిడ్డల పుస్తేలతాడులు తెగుతున్నాయని అన్నారు. జాగృతి కోసం ఫీనిక్స్ లాంటి సంస్థల నుండి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. కేసీఆర్ కవితకి పిత, తెలంగాణకి పిశాచి అని ఎద్దేవా చేశారు. జై తెలంగాణ అని పిడికిలి బిగించి దోచుకున్నది కేసీఆర్ ఫ్యామిలీ కాదా అని ప్రశ్నించారు. కవిత ఏ వ్యాపారం చేసిందని కోట్ల రూపాయలు సంపాదించిందన్నారు. అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవడానికే కవిత జాగృతిని బలోపేతం చేస్తోందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. తెలంగాణ రాక ముందు వసూళ్ల కోసం వాడుకున్న సంస్థ జాగృతి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాగృతి సంస్థ అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక రైతులకు సహాయం చేస్తామన్న కవిత ఇప్పటి వరకు బీసీ, ఎస్సీలకు నయాపైసా సహాయం చేయలేదని.. స్వార్ధ రాజకీయాల కోసమే బీసి నినాదం ఎత్తుకుందన్నారు. బీసీల కోసం మాట్లాడుతున్న కవిత ఎందుకు జాగృతిని (Telangana Jagruthi) బీసీల చేతిలో పెట్టలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ సాధన కాదని కేవలం తెలంగాణకి ముఖ్యమంత్రి కావడమే అని అన్నారు. తనని ముఖ్యమంత్రిని చేస్తే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియాకి చెప్పారని గుర్తు చేశారు. చెట్ల సంతోష్ ఇప్పుడు చెట్లను ఎందుకు నాటడం లేదని నిలదీశారు. అమెరికా, దుబాయ్ లలో కేటీఆర్, కవితలకి పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఇన్వెస్ట్మెంట్ చూసుకోవడానికే కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ మొజంజాహీ మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకునే వాళ్ళని కవిత ఏపీలో బ్యూటీ పార్లర్ పెట్టుకునేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ జెండా కూడా ఎగరేయలేదని విమర్శించారు.






