ఏటా మధుకర్ ఆత్మహత్య వార్త తీవ్రంగా కలిచివేసింది: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

by Malleboina Mahesh |

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బీజేపీ నేత ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఏటా మధుకర్ ఆత్మహత్య వార్త తీవ్రంగా కలిచివేసింది: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బీజేపీ నేత ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అక్రమ కేసులతో అధికార పార్టీ నేతలు తనను వేధిస్తున్నారని మధుకర్ సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే సొంత పార్టీ నేత ఆత్మహత్య పై స్పందించిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఈ రోజు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీల్వాయి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య వార్త తీవ్రంగా కలిచివేసిందని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు.

తాను ఈ రోజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశానని, పార్టీ కోసం నిస్వార్థంగా సేవలందించిన ధైర్యవంతుడైన మధుకర్.. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తాము బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతలు, బెదిరింపుల రాజకీయాలు తీవ్రంగా ఖండిస్తున్నామని, మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. అలాగే అధికార పార్టీ నుండి ఏమైనా ఇబ్బందులు ఉంటే.. తమను సంప్రదించాలని, కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా పార్టీని సంప్రదించాలని ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు కార్యకర్తలకు సూచించారు.

Next Story