- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచిత బస్సులు ఎక్కి ఎక్కడికి వెళ్లాలి? మాధవీలత ఫైర్
తెలంగాణలో మహిళలు కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన మహాలక్ష్మి పథకంపై బీజేపీ నాయకురాలు మండిపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మహిళలు కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన మహాలక్ష్మి పథకంపై బీజేపీ నాయకురాలు మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు కొంపల్లి మాధవీలత మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి కల్పించకుండా ఉచిత బస్సు సౌకర్యం పెడితే వారు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఊదర గొడుతున్న ఫ్రీ బస్సు సర్వీసులో ఎక్కడికి వెళ్లి తిరిగి రావాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. టిఫిన్ డబ్బా పట్టుకొని, బస్సుల్లో తిరిగి బస్సుల్లోనే తిని అందులోనే తిరిగి ఇంటికి రావాలా అని ఎద్దేవా చేసారు. ముందు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, అప్పుడు వారికోసం ఇలాంటి పథకాలు పెడితే మంచిది అని మాధవీలత సూచించారు.
Next Story






