ఆధారాల్లేవు.. అయినా నవీన్ రావును విచారణకు పిలిచారు: ఎమ్మెల్యే మాధవరం

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆదివారం విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించారు.

ఆధారాల్లేవు.. అయినా నవీన్ రావును విచారణకు పిలిచారు: ఎమ్మెల్యే మాధవరం
X

దిశ , తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆదివారం విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించారు. ప్రత్యేక డివైజ్‌లను ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టు నవీన్ రావుపై ఆరోపణలపై ఆరా తీశారు. తాజాగా ఈ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే నవీన్‌రావును విచారణకు పిలవడం రాజకీయ కుట్ర అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణులను వేధించడానికే చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇది బీఆర్ఎస్‌పై జరుగుతున్న దాడి మాత్రమేనని అన్నారు. తమ బండారం బయటపడుతుందనే భయంతోనే స్పీకర్, ముఖ్యమంత్రి గురించి మాట్లాడొద్దని చెప్పారని విమర్శించారు. మొత్తం వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రేనని మాధవరం కృష్ణారావు తెలిపారు.

Next Story