- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి కాకపోతే ప్రధాని మంత్రి అయిపో నాకేంటి?: కవితకు మాధవరం కౌంటర్
ముఖ్యమంత్రి కాకపోతే ప్రధాని మంత్రి అయిపో నాకేంటి?: కవితకు మాధవరం కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: తాను సీఎం అయ్యాక ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అని కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కాకపోతే ప్రధాన మంత్రి అవమనండి.. నాకేంటి? అన్నారు. ఆమె కావాలో ఆమె అనుకుంటే కాదు.. ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. లిక్కర్ దందాలు చేసిన ఆమెను ఎవరూ నమ్మరని కౌంటర్ ఇచ్చారు.
అంతకుముందు కవిత మాట్లాడుతూ.. తానూ ఏదో ఒక రోజు సీఎం అవుతానని, 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తానని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నది తాను వేసిన టాస్ మాత్రమేనని.. వారి అవినీతి, అక్రమాలపై అసలు టెస్ట్ మ్యాచ్ త్వరలో ఉండబోతున్నదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయొద్దని.. బీఆర్ఎస్ పాలనలో తాను, తన భర్త ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని స్పష్టం చేశారు. తనపై విష ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తా అని హెచ్చరించారు.






