- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు ధర పలికిన మై హోమ్ భూజా లడ్డూ..బాలాపూర్ లడ్డూను దాటేసిందిగా
by Ajay Maddhiboyina |
మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. చాలా సేపటి వరకు లడ్డూ వేలంపాట హోరా హోరీగా సాగింది. ఈ వేలం పాటలో రూ. 51,07,777లకు లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇల్లందు గణేష్ సొంతం చేసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్/ శేరిలింగంపల్లి: మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. చాలా సేపటి వరకు లడ్డూ వేలంపాట హోరా హోరీగా సాగింది. ఈ వేలం పాటలో రూ. 51,07,777లకు లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇల్లందు గణేష్ సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం ఇక్కడ లడ్డు వేలం పాట రూ. 29 లక్షలకు పాడారు.
గతేడాది కూడా లడ్డూను గణేష్ ఏ దక్కించుకున్నారు. ఈ ఏడాది కూడా ఆయనే దక్కించుకోవడం విశేషం. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి గణేష్, సరిత దంపతులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే గతేడాది బాలాపూర్ లడ్డూ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు వేలం పాడగా ఇప్పుడు మై హోమ్ భుజా లడ్డూ వేలంలో దానిని దాటేసింది.
Next Story






