‘మా అంకుల్ ఎవరో తెలుసా’ పనిచేయదు! డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సజ్జనార్ సెటైరికల్ ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-12-28 10:47:39  IST  )

న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘మా అంకుల్ ఎవరో తెలుసా’ పనిచేయదు! డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సజ్జనార్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఎదురయ్యే పరిణామాలను హాస్యంతో కూడిన కఠిన సందేశంగా ఆయన ప్రజలకు గుర్తు చేశారు. ‘మియా, డ్రింక్ చేశావా? అయితే స్టిరింగ్‌కు సలాం చెప్పి క్యాబ్‌లో వెళ్లు, గూగుల్‌లో క్యాబ్ బుక్ చేసుకో.. లాయర్‌ని కాదు’ అంటూ ట్వీట్ చేసిన సజ్జనార్, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా క్యాబ్ ఎంచుకోవాలని సూచించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందన పొందుతోంది.

అలాగే మరో ట్వీట్‌లో, ‘మా డాడి ఎవరో తెలుసా’, ‘మా అంకుల్ ఎవరో తెలుసా’, ‘మా అన్న ఎవరో తెలుసా’.. అని ఇలా మా ఆఫీసర్‌లను అడగొద్దు. మేము మీ ప్రైవసీని గౌరవిస్తాం. వాహనం పక్కకు పెట్టి, మళ్లీ తేదీ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అంటూ సెటైర్లు వేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో హైదరాబాద్ పోలీసులది జీరో టాలరెన్స్ విధానం అని ఆయన స్పష్టం చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా రహదారులపై ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీసులు కఠిన తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, సీపీ సజ్జనార్ ట్వీట్లు ప్రజలను చైతన్యపరచేలా ఉన్నాయి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండి, సురక్షిత ప్రయాణాన్ని ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ట్వీట్ ఇదే..

Next Story