- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ)గా ఎం.రాజశేఖర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం. రాజశేఖర్ హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం. రాజశేఖర్ బుధవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సంస్థ ఎండీ వై. నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఈడీకి సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణికులకు టికెట్ బుకింగ్, లైవ్ బస్ ట్రాకింగ్ వంటి డిజిటల్ సేవలను మరింత సులభతరంగా అందుబాటులోకి తీసుకువస్తామని రాజశేఖర్ తెలిపారు.
ఐటీ విభాగంతో పాటు పర్సనల్, అస్సెట్ మేనేజ్‌మెంట్, లీగల్ విభాగాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సంస్థ ఆదాయ వనరులను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, అంతర్గత పరిపాలనను వేగవంతం చేస్తామని, అలాగే సంస్థకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను సకాలంలో పరిష్కరించి ఆర్టీసీ ప్రయోజనాలను కాపాడుతామని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం, అధికారులు, కార్మికులను సమన్వయం చేసుకుంటూ టీజీఎస్ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామని ఈడీ రాజశేఖర్ తెలిపారు.






