రూ.5 వేలకే 128 గజాల ఇల్లు.. హైదరాబాద్‍లో లక్కీ డ్రా ఆఫర్.. ఫోటోలు వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-11-20 07:48:32  IST  )

రియల్ ఎస్టేట్ లో లక్కీ డ్రా ట్రెండ్ జోరుగా సాగుతోంది.

రూ.5 వేలకే 128 గజాల ఇల్లు.. హైదరాబాద్‍లో లక్కీ డ్రా ఆఫర్.. ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రియల్ ఎస్టేట్ (Real Estate), రంగంలో లక్కీ డ్రా ట్రెండ్ నడుస్తోంది. తమ ఇంటి, స్థలాలు ప్లాంట్ల సేల్స్ కోసం వాటి యజమానులు వినూత్నంగా ఆలోచించి లక్కీ డ్రా (Lucky Draw) పద్దతులకు తెరలేపారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త్యంగా ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ జోరుగా సాగుతోంది. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలోని శ్రీపురి కాలనీలో ఓ ఇంటి యజమాని హౌస్ లక్కి డ్రా నిర్వహిస్తున్నారు. రూ. 5 వేల టికెట్ తో రూ. 1.25 కోట్ల విలువ చేసే 128 గజాల జీ+1 ఇండిపెండెంట్ ఇల్లుకోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం కూపన్లను విక్రయిస్తున్నామని ఆసక్తి కలిగిన వారు 9246629525 ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అలువాల దేవేందర్ అనే వ్యక్తికి కూపన్ డబ్బులు చెల్లించాలంటూ ఓ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూపన్ డబ్బులు చెల్లించిన వారు ఆ ట్రాన్ జక్షన్‍కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను పంపిస్తే కూపన్ రాసి దాని ఫోటోను వాట్సాప్ లో పంపిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఉగాది పండగ రోజున 19 మార్చి 2025న డ్రా తీస్తామని పేర్కొన్నారు. లక్కీ డ్రా నేరుగా అందరి సమక్షంలో యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ లో జరుగుతుందని లక్కీ డ్రా కూపన్ ధర రూ. 5 వేలు ఎట్టి పరిస్థితితుల్లో తిరిగి చెల్లించబబడదని పేర్కొన్నారు. గెలుపొందిన విజేతలే రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడీ లక్కీ డ్రా వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మోసాల పట్ల అలర్ట్:

కాగా రాష్ట్రంలో రోజు రోజుకు ఇటువంటి లక్కీ డ్రా స్కీమ్ ల సంఖ్య పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితోనే ఇంటిని గెలుచుకునే అవకాశం లభిస్తుండటంతో ఇటువంటి వాటికి సాధారణ మధ్యతరగతి, పేద ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జయనగర్ కాలనీలో ఓ ఇంటి అమ్మకంపై లక్కీ డ్రాను దాని యజమాని నిర్వహించగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఖమ్మం అర్బన్ పీఎస్ లో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఇలా లక్కీ డ్రా పేరుతో పొలాన్ని అమ్ముతానని చెప్పి మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. వరుస మోసాల నేపథ్యంలో ఇలాంటి లక్కీ డ్రా ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story