- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ భార్య బాధ సరే మరి ఉద్యోగుల భార్యలది బాధ కాదా?.. ఎల్ అండ్ టీ చైర్మన్ పై నెటిజన్ల గుస్సా
'ఇంట్లో భార్యను చూస్తూ ఎంత సేపు కూర్చుంటారు' అంటూ ఆదివారాల్లోనూ పని చేయాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎల్ ఆండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 'ఇంట్లో భార్యను చూస్తూ ఎంత సేపు కూర్చుంటారు' అంటూ ఆదివారాల్లోనూ పని చేయాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎల్ ఆండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ (L&T, Subrahmanyaman) స్పందించారు. దేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 90 గంటలు పని చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింన సంగతి తెలిసిందే. అయితే తన మాటల పట్ల తన భార్య కూడా బాధపడిందని తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రాజెక్టులు ఆలస్యం కావడం క్లయింట్ లు లేవనెత్తిన ఆందోళనల కారణంగా ఆ సమయంలో తాను ఒత్తిడితో అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. నిజానికి ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇది నాపై కానీ సంస్థపై కానీ మంచి ప్రభావం చూపదన్నారు. అయితే తాను ఈ వ్యాఖ్యలను అంతర్గత సమావేశంలో చెప్పానని ఎవరిని ఆదేశించలేదన్నారు. తన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా రికార్డు చేయబడ్డాయని విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో తన భార్య కూడా ప్రస్తావించబడటంతో ఆమె కలత చెందిందన్నారు. ఇలాంటి ప్రశ్నలు మళ్లీ అడిగితే తాను భిన్నంగా సమాధానం చెబుతానన్నారు. పని తీరు మా ఆక్సిజన్ అంటూ వివరించారు.
అయితే సుబ్రహ్మణ్యన్ తాజాగా వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు కార్నర్ చేస్తున్నారు. 90 గంటల పని విషయంలో ఆయనకు ఎలాంటి పశ్చాతాపం లేదని ఇప్పుడైతే నేను వేరేలా సమాధానం ఇచ్చేవాడిని అన్న మాట ఇందుకు నిదర్శనం అని విమర్శలు గుప్పిస్తున్నారు. తన వ్యాఖ్యపై విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధం కాలేరని విమర్శిస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తూ ప్లాన్ ప్రకారమే సుబ్రహ్మణ్యన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మీ భార్య బాధపడుతుందని చెబుతున్నారు కానీ ఎంతో మంది ఉద్యోగుల భార్యలు బాధపడరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా దేశంలో పని గంటలపై గతంలో ఇన్ఫోసిస్ నారాయణ వ్యాఖ్యలు చేయగా అదే బాటలు కామెంట్ చేసిన సుబ్రహ్మణ్యం తాజా ఇంటర్వ్యూతో మరోసారి చర్చగా మారారు.






