- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంతోపాటు మొత్తం ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంతోపాటు మొత్తం ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజులో 25రాయితీ గతేడాది 31మే ఉన్నది. గడువు ముగియడంతో లక్షలాది మంది వినియోగించుకోలేకపోయారని గుర్తించిన ప్రభుత్వం మరోసారి ఈనెల 1వ తేది నుంచి 31జులై వరకు అవకాశం కల్పించింది. అయితే ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను నివృత్తి చేయడానికి ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు(పనిదినాల్లో మాత్రమే) హెల్ప్ డెస్క్/కాల్ సెంటర్ పనిచేస్తోందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్ఆర్ఎస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు చెల్లించడానికి, షార్ట్ ఫాల్స్ డాక్యుమెంట్స్ అందజేయడానికి దరఖాస్తులకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని తీర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ పేర్కొన్నది. అన్ని సర్కిల్, జోనల్ ఆఫీసులతోపాటు హెడ్ ఆఫీసులోనూ హెల్ఫ్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.
సీఎంసీ, ఎంఎంసీలో సైతం…
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలోనూ హెల్ప్ డెస్క్/ కాల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కార్పొరేషన్లలో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.






