రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు: జూలై 31 వరకు 25 శాతం రాయితీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 01:18:15  IST  )

తెలంగాణలో ఎల్ఆర్ఎస్ (LRS) దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు: జూలై 31 వరకు 25 శాతం రాయితీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: లే అవుట్ రెగ్యులరైజ్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నది. వీటి ద్వారా ప్రభుత్వం రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనావేసింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా గతేడాది నాలుగు నెలల్లో రూ.రెండువేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అయినా సరే ‘ఎంతవస్తే.. అంతే.. 25శాతం రాయితీ గడువు ఇద్దాం.’ అంటూ మరోసారి మూడు నెలల పాటు మే 1 నుంచి 31జులై వరకు రాయితీ కల్పిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సుమారు ఆరు లక్షలకుపైగా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినా.. రెండు లక్షల మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ ఇచ్చారు.

ఎల్ఆర్ఎస్ ప్రోగ్రెస్..

రాష్ట్రవ్యాప్తంగా 26.15లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. 6.04లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 20.11లక్షల దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. ఇప్పటి వరకు 6.26లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. వీటిలో సుమారు రెండు లక్షల మందికి అధికారులు ప్రొసీడింగ్స్ జారీచేశారు. అయితే ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి దరఖాస్తులను వెరిఫై చేస్తున్నారు. ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు పరిశీలించిన తర్వాతనే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.

ఆదాయంపైనే ఆశలు..

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ఇప్పటివరకు రూ.రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఫీజులో రాయితీ ఇవ్వకముందు(20 ఫిబ్రవరి 2025) రూ.114.73కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఫిబ్రవరి 20 నుంచి 25శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరిలో రూ.1.18కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. మార్చిలో రూ.1,402.02 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ లో రూ.353.17కోట్లు, మేలో రూ.119.84కోట్లు, జూన్ 15 వరకు రూ.9.81కోట్లు మాత్రమే వచ్చింది. అయినా ఫరవాలేదని ప్రభుత్వం ఈనెలాఖరుకు 25శాతం రాయితీ గడువును పొడిగించింది.

మరోసారి అవకాశం

రాష్ట్రంలో అనుమతుల్లేని లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, చార్జీల్లో 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 1మే నుంచి 31జులై వరకు ఈ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ ఈ మేరకు బుధవారం జీవో ఎంఎస్ నెం.131 జారీచేశారు.

Next Story