పీటల మీదనే ఆగిపోయిన ‘ప్రేమ వివాహం’.. పెళ్లి కొడుకు చేసిన పనికి మీకూ కోపం రావడం ఖాయం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-25 14:27:34  IST  )

ప్రేమిస్తే పెద్దలను ఒప్పించాలి.. ఎలాగైనా కలిసి ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి.. అవసరమైతే కాళ్లు, వేళ్లూ పట్టుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి(Love Marriage) చేసుకోవాలి.. ఇదంతా ఒకప్పటి మాట.

పీటల మీదనే ఆగిపోయిన ‘ప్రేమ వివాహం’.. పెళ్లి కొడుకు చేసిన పనికి మీకూ కోపం రావడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమిస్తే పెద్దలను ఒప్పించాలి.. ఎలాగైనా కలిసి ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి.. అవసరమైతే కాళ్లు, వేళ్లూ పట్టుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి(Love Marriage) చేసుకోవాలి.. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమించిన అమ్మాయి అయినా.. పెద్దలు కుదిర్చిన అమ్మాయి అయినా కట్నం తెస్తేనే పెళ్లి జరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వరుడు కట్నం డిమాండ్ చేయడంతో ప్రేమ వివాహం ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం(Khammam) జిల్లా కూసుమంచిలో మండలంలోని రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీ, యువకుడు గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి(Marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై పెద్దలను సైతం ఒప్పించి పెళ్లి వరకూ తెచ్చారు. ముందుగా.. వరకట్నంగా కొంత నగదు, ఎకరం భూమి ఇస్తామని వధువు తల్లిదండ్రులు అంగీకరించారు. నగదులో నుంచి కొంత మొత్తం వరుడికి పెళ్లికి ముందే అందించారు.

పొరుగు జిల్లాలోని ఒక ప్రముఖ ఆలయంలో రాత్రి పెళ్లి వేడుక ప్రారంభమైంది.. అయితే జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వరుడు తన డిమాండ్లను వధువు తరపు పెద్దల ముందు పెట్టి అందరికీ షాకిచ్చాడు. తనకు ఇవ్వాల్సిన మిగతా నగదుతో పాటు ఎకరం భూమి ఎప్పుడిస్తారో ఒప్పందపత్రం రాసివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వధువు తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడగటానికి సమయం ఇదేనా? అని సీరియస్ అయ్యారు. చివరి వరకు వరుడి తరపు బంధువులు మొండిపట్టు పట్టడంతో చివరి క్షణాల్లో పెళ్లి నిలిచిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లికి వెళ్లిన కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ విషయం కాస్త అందరికీ తెలిసిపోయింది. వరుడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమ్మాయిని ఆస్తి కోసం ప్రేమించాడా? లేదా? నిజంగానే ఇష్టపడ్డాడా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story