2 నెలల కిందటే ప్రేమ వివాహం.. పాశమైలారం ఘటనలో నవదంపతులు దుర్మరణం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-01 07:30:46  IST  )

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ (Pashamilaram Industrial Area)లో సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలి(Reactor explosion).. భారీ అగ్ని ప్రమాదం (major fire hazard) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

2 నెలల కిందటే ప్రేమ వివాహం.. పాశమైలారం ఘటనలో నవదంపతులు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ (Pashamilaram Industrial Area)లో సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలి(Reactor explosion).. భారీ అగ్ని ప్రమాదం (major fire hazard) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. భారీ శబ్దంతో జరిగిన పేలుడు కారణంగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది ప్రాణాలు (45 people died) కోల్పోయారు. మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండగా, దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పేలుడు ధాటికి కూలిన భవన శిథిలాల్లో పలువురు చిక్కుకుని మృతిచెందినట్టు అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా సాధ్యపడట్లేదు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి (24), శ్రీరమ్య (22) అనే యువ దంపతులు కూడా ఉన్నారు. రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట కొత్త జీవితం ప్రారంభించి కలలతో ముందుకు సాగుతోంది. ఉద్యోగావకాశాల కోసం హైదరాబాద్‌లో నివసిస్తూ, కార్మికులుగా సిగాచీ పరిశ్రమలో పని చేస్తున్న నిఖిల్, శ్రీరమ్య ఆ రోజు విధులకు హాజరైన వేళ ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story