- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
by Sathputhe Rajesh |
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది.

X
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదం మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మతాలు వేరు కావటంతో కల్పన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు.
రెండు నెలల క్రితం కల్పనను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసారు. దీనిని తట్టుకోలేక కల్పన, ఖలీల్ నాలుగు రోజుల క్రితం పారిపోయారు. దీనిపై ఇరు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు గాలిస్తుండగానే ఇద్దరి మృతదేహాలు నార్సింగి చెరువులో తేలాయి. పారిపోయిన రోజే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.
Next Story






