ప్రేమ విఫలం.. రైలు కింద పడి యువకుడు..

by Sathputhe Rajesh |

ప్రేమ విఫలమై ఓ యువకుడు రైలు కింద సూసైడ్ చేసుకున్నాడు.

ప్రేమ విఫలం.. రైలు కింద పడి యువకుడు..
X

దిశ, రఘునాథపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు రైలు కింద సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో చోటు చేసుకుంది. గోవర్ధనగిరి - కోమల గ్రామాల మధ్య రైల్వే ట్రాక్‌పై దొంతు శ్రీనివాస్ (28) బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, మంచి మెకానిక్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే ఓ అమ్మాయి‌తో ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో గతంలో మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ప్రేమ విఫలమై మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. జనగామ జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ అర్జీఆర్పిఎఫ్ పోలీసులకు తెలిపారు.

Next Story