- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
600 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఘట్ కేసర్ పోచారం ప్రాంతంలో నిర్మించిన 600 ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ శుక్ర, శనివారాల్లో

600 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ
- నేడు, రేపు లబ్ధిదారులకు కేటాయింపు
- ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ప్రత్యక్ష ప్రసారం
దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఘట్ కేసర్ పోచారం ప్రాంతంలో నిర్మించిన 600 ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. రూ.13 లక్షలకు 1 బీహెచ్‌కే ఫ్లాట్లను, రూ.19 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి గురువారం సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించారు. నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న 255 సింగిల్ బెడ్ రూం, 340 డబుల్ బెడ్ రూం ఫ్లాట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు.
గురువారం పోచారంలోని టౌన్ షిప్‌ను సందర్శించి లాటరీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. సాయంత్రం 6 గంటల తరువాత కూడా దరఖాస్తులను సమర్పించడానికి క్యూలైన్లలో ఉన్న వారితో ఆయన నేరుగా మాట్లాడారు. లాటరీ పద్ధతిలో వీటిని అలాట్ చేయనున్నారు. శుక్రవారం ఉదయం డబుల్ బెడ్ రూం ఫ్లాట్లకు, శనివారం సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ల లాటరీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఎండీ తెలిపారు. లాటరీ ప్రక్రియను యూట్యూబ్, రాజీవ్ స్వగృహ ఫేస్‌బుక్, వెబ్‌సైట్లలో https://youtube.com/live/6UVUVbdkCYg చూడవచ్చని ఎండీ వివరించారు. దరఖాస్తుదారులు లాటరీ ప్రక్రియను చూసేందుకు ప్రాజెక్టు ప్రాంగణంలోనూ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






