121 ప్రమిదలతో వినూత్న వినాయకుడు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్ రీ-ట్రీట్ కాలనీ హరి హర రెసిడెన్సీలో శనివారం 121 ప్రమీదలతో గణేష్ విగ్రహం రూపాన్ని తయాచేశారు.

121 ప్రమిదలతో వినూత్న వినాయకుడు
X

దిశ, సిటీక్రైం: హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్ రీ-ట్రీట్ కాలనీ హరి హర రెసిడెన్సీలో శనివారం 121 ప్రమీదలతో గణేష్ విగ్రహం రూపాన్ని తయాచేశారు. లావణ్య, రాంచందర్ దంపతులు దీనిని తయారు చేశారు. అనంతరం పూజలు చేశారు. ఈ ప్రమిదిల వినాయకుడి రూపం అందరినీ ఆకట్టుకుంది. వినాయ‌క చ‌వితి సందర్భంగా గ‌ణేశ్ న‌వ‌రాత్రి ఉత్సవాలు నగర వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. వినాయక మండపాల వద్ద వివిధ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఎక్కడ చూసినా.. మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ మండపాలలో విభిన్న రూపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు.. భక్తుల విశేష పూజలు అందుకుంటున్నాడు.

Next Story