సుంకిశాలలా కాకుండా చూడండి.. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కేటీఆర్ మరోసారి విమర్శలు

by Ramesh Goud |

సుంకిశాల ప్రమాదం (Sunkishala Incident)లా కాకుండా చూడాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) ఉద్దేశించి అన్నారు.

సుంకిశాలలా కాకుండా చూడండి.. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కేటీఆర్ మరోసారి విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: సుంకిశాల ప్రమాదం (Sunkishala Incident)లా కాకుండా చూడాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) ఉద్దేశించి అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సుంకిశాల రీటైనింగ్ వాల్ (Sunkishala Retaining Wall) ప్రమాద ఘటనను గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై సంచలన ఆరోపణలు చేశారు. నాలుగు రోజులు క్రితమే మొదలయిన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదాన్ని దాచిపెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వారి ఆలోచనలకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.

అలాగే ప్రమాదం పొద్దున్న 8:30 గంటలకు జరిగితే మధ్యాహ్నం వరకు ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో కూడా తెలియని స్థితిలో యంత్రాంగం ఉంది అని ఎద్దేవా చేశారు. అంతేగాక సీపేజ్ వచ్చింది, అందుకే కూలింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ (Minister Uttam Kumar Reddy) చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. సీపేజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు పాటించలేదు? అని నిలదీశారు. ఇక సుంకిశాల ప్రమాదంలా దాచిపెట్టే ప్రయత్నం చెయ్యకుండా.. ఇప్పటికయినా ఎంతమంది కార్మికులు లోపల ఇరుకున్నారు, వారిని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ నేత (BRS Leader) డిమాండ్ (Demand) చేశారు.

అంతకు ముందు కేటీఆర్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని, సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అంతేగాక కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు (Congress Leaders) తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారు అని వ్యాఖ్యానించారు.

Next Story