- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Roja : లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు : మాజీ మంత్రి రోజా
దావోస్(Davos)పర్యటనలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : దావోస్(Davos)పర్యటనలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అని.. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తే..చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వచ్చిందని రోజా దుయ్యబట్టారు.
సీఎం చంద్రబాబు, లోకేష్ ల పాలనతో రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుండంతో దావోస్ పర్యటనలో ఒక్క రూపాయి ఎంవోయు పెట్టుబడులు రాలేదని ఇది చాల బాధకరమన్నారు. దావోస్ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, షూట్లకు రూ.20 కోట్ల వరకు ఖర్చయ్యిందని..కనీసం ఆ ఖర్చుల వరకైనా పెట్టుబడులు దక్కలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలోనూ రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారని... అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారని.. దావోస్ లోనూ అదే తరహాలో మభ్య పెట్టాలని చూశారని..అయితే చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారని రోజా విమర్శించారు.
వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా మెయింటెయిన్ చేశారని..మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారని..వైఎస్ జగన్ ను చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారన్నారు. చంద్రబాబును, ఆయన పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా?. మీ అరాచక రెడ్ బుక్ పాలన చూసి పెట్టుబడుదారులు భయపడుతున్నార్నారు. ముంబై నుంచి ఓ జూనియర్ అర్టిస్టును తీసుకొచ్చి ఆమెతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ వంటి పారిశ్రామిక వేత్తను బెదిరించారని, ఐపీఎస్, ఐఏఎస్ లపై కక్ష సాధింపులకు పాల్పడుతు, కేసుల పాలు చేస్తుంటే ఈ రాష్ట్రానికి ఎవరైన పెట్టబడులు పెట్టేందుకు ఎలా ముందుకొస్తారని రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్ తీరుతో దావోస్ లోఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని..ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని.. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని రోజా ప్రశ్నించారు. రాష్ట్ర పరువు కాపాడాలని ఆ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నానని.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఎందుకు దావోస్ తీసుకెళ్లలేదని.. పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా?" అంటూ రోజా ప్రశ్నలు గుప్పించారు.






