- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
T TDP: తెలంగాణలో టీడీపీపై నారా లోకేశ్ సెన్సేషనల్ కామెంట్స్.. త్వరలోనే కీలక పరిణామం!

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీడీపీ (TTDP) పార్టీ ఫ్యూచర్ పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ (Naralokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. శనివారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పార్టీపై తెలంగాణలో ఆశ, అభిమానం ఉన్నాయని అన్నారు. తెలంగాణలో 1.60 లక్షల మంది టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారని ఇక్కడ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకుండానే ఇంత మంది సభ్యత్వాలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అత్యధికంగా 4 లక్షల సభ్యత్వాలే ఉండేవి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలే స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకుంటున్నారంటే ఈ ప్రాంత ప్రజలకు పార్టీ పట్ల ప్రేమ ఉందన్నారు.
త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం:
త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయనే చర్చ జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పట్టు సాధించాలనే వ్యూహంతో ఉన్న బీజేపీ (BJP) పార్టీ ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కూటమిగా రాబోతున్నదనే టాక్ వినిపిస్తున్నది. ఇందుకు ఇటీవల రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో టీడీపీకి ఇంకా క్యాడర్ ఉండటం, త్వరలోనే కొంత మంది కీలక నేతలు సైకిల్ పార్టీలోకి ఎంటర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఇక్కడ కూడా రిపీట్ కాబోతున్నదనే చర్చ జరుగుతున్నది. గతేడాది తెలంగాణలో పర్యటించిన పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన (JANASENA) పార్టీలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో జనసేన, టీడీపీ పొత్తు మరో దశాబ్ద కాలానికి పైగానే ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణలోనూ కూటమి ఏర్పడటం ఖాయం అనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ (PAWANLAKYAN) సోదరుడు చిరంజీవి (CHIRANJEEVI)కి సైతం బీజేపీ ఇస్తున్న ప్రయార్టీ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల ఢిల్లీలో కిషన్ రెడ్డి (KISHAN REDDY) నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో మోడీ సన్నిహితంగా మెలిగారు. గతంలోనూ చిరంజీవికి కమలం పార్టీ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. తెలంగాణలోనూ మెగా బ్రదర్స్ కు భారీగా అభిమానలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనానికి దారి తీయబోతున్నదా అనే చర్చ పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తోంది.