- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RRR మూవీ సీన్ రిపీట్... వాగులో చిక్కుకుపోయిన నలుగురు యువకులను !
చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులను... గ్రామస్తులు చాలా చాకచక్యంతో కాపాడారు. తాడు వేసి... అవతల గట్టున ఉన్న వాళ్లను

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల నేపథ్యంలో... వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాల్లోకి వరద నీరు వచ్చినట్లు వీడియోలు బయటకు వస్తున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారిపోయాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులను... గ్రామస్తులు చాలా చాకచక్యంతో కాపాడారు. తాడు వేసి... అవతల గట్టున ఉన్న వాళ్లను.. రక్షించారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం బుగ్గ చెరువు వాగు దగ్గర జరిగింది. ఈ సంఘటనలో... RRR సినిమాలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు... జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గాల్లో ఎగిరిన సీన్ రిపీట్ అయింది.
ఈ సంఘటనలో వాగులో చిక్కుకున్న నలుగురు యువకులను తాళ్లతో స్థానికులు రక్షించారు. నిన్న ఉదయం ఈ నలుగురు యువకులు చేపల వేటకు వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లిన తర్వాత వాగు ఉధృతి విపరీతంగా పెరిగింది. దీంతో వాగు అవతలి గట్టున నలుగురు యువకులు చిక్కుకున్నారు. ఇది గమనించిన స్థానికులు... ఇవతలి గట్టున ఉండి... ఆ నలుగురు యువకులకు తాడు వేసి రక్షించారు. ఆ తాడును పట్టుకున్న యువకులు ఒక్కొక్కరు.. వాగులో దూకేసి గట్టుకు చేరుకున్నారు. దీంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. క్లిక్






