కొబ్బరికాయల వాహనం బోల్తా.. ఎగబడి సంచుల్లో ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

by Ramesh Naini |

కోతులకు కొబ్బరి చిప్ప దొరికితే ఏవిధంగానైతే ప్రవర్తిస్తుందో కొందరు మనుషులు కూడా ఈ మధ్య అంతకు మించి ప్రవర్తిస్తున్నారు.

కొబ్బరికాయల వాహనం బోల్తా.. ఎగబడి సంచుల్లో ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోతులకు కొబ్బరి చిప్ప దొరికితే ఏవిధంగానైతే ప్రవర్తిస్తుందో కొందరు మనుషులు కూడా ఈ మధ్య అంతకు మించి ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్టింట ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. తాజాగా వరంగల్‌ (Warangal) జిల్లా వర్ధన్నపేట వద్ద (coconuts) కొబ్బరికాయలతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తాపడింది. బొలేరోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో కొబ్బరికాయలు కింద పడటంతో సమీపంలోని తండావాసులు, స్థానికులు తరలివచ్చి వాటిని సంచుల్లో నింపేసి ఎత్తుకెళ్లారు. దొరికినోడికి దొరికినంత అని కొబ్బరికాయలను పెద్ద పెద్ద సంచుల్లో నింపుకొని జంప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఫ్రీ గా వస్తే ఫినాయిల్ తాగే జనాలు సిగ్గు లేని బతుకులు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇది మన భారత్ పరిస్థితి అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story