- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Local Reservations: ఆశావహులకు తీపి కబురు.. 4 రోజుల్లో ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
స్థానిక సంస్థలకు నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు పంచాయతీ రాజ్ అధికారులు కుస్తీ పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థలకు నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్ అధికారులు కుస్తీ పడుతున్నారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా.. రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అందుకే ఏ వర్గానికి ఎక్కడ రిజర్వేషన్ కల్పించాలన్న అంశంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయిన తరువాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం కానున్నది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
డెడికేటెడ్ సిఫార్సుల మేరకు బీసీ రిజర్వేషన్లు..
డెడికేటెడ్ బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించేందుకు పంచాయితీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం ఆరు కేటగిరీల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ..ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును సమర్పించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతంలోపే ఉండాలని కమిషన్ స్పష్టం చేసింది. 50 శాతం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసివేయగా .. బీసీలకు 23 నుంచి 24 శాతం లోపు రిజర్వేషన్లు దక్కుతాయని అధికారుల అంచనా. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న చోట్ల.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కుదరదు. బీసీలకు అధికంగా ఉన్న కొన్ని జిల్లాల్లో.. ఆ వర్గానికి 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు దక్కే చాన్స్ ఉంటుదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచనప్రాయంగా అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ..15వ తేదీ సాయంత్రం లోపు రిజర్వేషన్లు ఖరారైతే.. 16వ తేదీ నాటకి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.






