- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకల్ లీడర్స్ నారాజ్.. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై అసంతృప్తి
జీహెచ్ఎంసీలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలను ప్రభుత్వం విలీనం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలను ప్రభుత్వం విలీనం చేసింది. అయితే విలీనం చేయడంపై లోకల్ లీడర్స్ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. జీహెచ్ఎంసీ స్వీకరించిన అభ్యంతరాలు 1328 వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిలో అత్యధిక మంది అన్ని పార్టీలకు చెందిన లోకల్ లీడర్స్ ఉన్నారు. విలీనంతో తమకు రాజకీయ మనుగడ ఉండదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీగా ఉంటే తమకు కౌన్సిలర్/కార్పొరేటర్ గానో పోటీచేయడానికి అవకాశముంటుందని, జీహెచ్ఎంసీలో విలీనంతో చేయడం ఆ పరిస్థితి లేకుండా పోయింది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
622 వార్డులు..
తెలంగాణ కోర్ అర్బర్ రీజియన్(టీసీయూఆర్)లోని 27 పట్టణ స్థానిక సంస్థల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1312,24 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10,92,514 జనాభా ఉంది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 215 వార్డులు, 20 మున్సిపాలిటీల్లో 407 వార్డులు మొత్తం 622 ఉన్నాయి. వీటితోపాటు 27 యూఎల్బీల్లో విలీనం చేసిన 51 గ్రామాల్లోనూ 5 1మంది సర్పంచ్ స్థానాలు, సుమారు 500 వార్డులు ఉండే అవకాశముందని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు.
విలీనంతో నారాజ్
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనానికి ముందు 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ గ్రామాలను విలీనం చేసిన తర్వాత సదురు యూఎల్బీలో వార్డుల పునర్విభజన జరగలేదు. అయితే వీటన్నింటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో లోకల్ లీడర్లకు పెద్ద దెబ్బేనని అన్ని రాజకీయ పార్టీల నేతలు వాపోతున్నారు. 27యూఎల్బీల్లో 622 మంది వార్డులు సభ్యులు, 27మంది మేయర్/చైర్మెన్ పదవులు లేకుండపోయాయి. వీటిలో 51 గ్రామ పంచాయతీల్లో 51 మంది సర్పంచ్ పదవులు, సుమారు 500 కుపైగా వార్డుల సభ్యులను కోల్పోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమను రాజకీయంగా ఎదగకుండా చేయడానికే ప్రభుత్వం విలీనం చేసిందనే విమర్శలు లేకపోలేదు.
53 వార్డులే..
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన చేశారు. పాత జీహెచ్ఎంసీలో 150 వార్డులను 40 వేల నుంచి 50 వేల జనాభా ప్రాతిపదికన 247 వార్డులకు పెంచారు. పాతబస్తీలో గతంలో 50కిపైగా వార్డులుంటే పునర్విభజనతో 70కి పైగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇక విలీనం యూఎల్బీలను మాత్రం 53 వార్డులకు కుదించారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఒక్కోవార్డుతోనే సరిపెట్టారు. జనాభా తక్కువగా ఉండడంతోనే వార్డులను కుదించినట్లు అధికారులు చెబుతున్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను నాలుగు వార్డులుగా చేశారు. బండ్లగూడ జాగీర్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లను మూడేసి వార్డులుగా చేశారు.
అభ్యంతరాలు 1328…
జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీల విలీనంపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఎల్బీనగర్, చార్మినార్ జోన్ల నుంచి అత్యధికంగా అభ్యంతరాలు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలోని ఏరియాలను చార్మినార్ జోన్లలో విలీనం చేయకూడదని స్థానికులు, రాజకీయ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా సరిహద్దుల విషయంలో అధికారులు శాస్త్రీయ పద్ధతులు పాటించడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు వార్డుల పునర్విభజన చేసిన అధికారులు వార్డులకు సంబంధించిన మ్యాపులను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరాలు వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.
తేదీ - అభ్యంతరాల సంఖ్య
మున్సిపాలిటీ పేరు/ వార్డుల సంఖ్య /విలీనంతో వార్డుల సంఖ్య
దమ్మాయిగుడ /18 /1
దుండిగల్ 28 3
ఘట్ కేసర్ 18 2
గుండ్లపోచంపల్లి 15 1
కోంపల్లి 18 2
మేడ్చల్ 23 2
నాగారం 20 1
పోచారం 18 1
తూంకుంట 16 1
ఆదిభట్ల 15 2
జల్ పల్లి 28 3
మణికొండ 30 2
నార్సింగి 18 3
పెద్దఅంబర్ పేట్ 24 2
శంషాబాద్ 25 2
తుక్కుగుడ 15 2
తుర్కయంజాల్ 24 2
అమీన్ పూర్ 24 2
బొల్లారం 22 1
తెల్లాపూర్ 17 1
మున్సిపల్ కార్పొరేషన్/ వార్డుల సంఖ్య/ విలీనంతో వార్డు సంఖ్య
బోడుప్పల్/ 28 / 2
జవహార్ నగర్ 28 1
బడంగ్ పేట్ 32 2
బండ్లగుడ జాగీర్ 22 3
మీర్ పేట్ 46 3
నిజాంపేట్ 33 4
ఫీర్జాదిగుడ 26 2
మొత్తం/ 621 /53






