- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Kumar Goud : కోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు : మహేష్ కుమార్ గౌడ్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)పై తెలంగాణ పీసీసీ చీఫ్(TPCC Cheif) క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)పై తెలంగాణ పీసీసీ చీఫ్(TPCC Cheif) క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్(Hyderabad) లోని గాంధీ భవన్(Gandhi Bhavan) లో నేడు మీడియా సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పలు విషయాలపై వ్యాఖ్యానించారు. హైకోర్టు పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్ ఆశంలో న్యాయస్థానం స్పష్టత వచ్చాకే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఏకపక్షంగా ప్రకటన చేయడం సరికాదని సూచించానన్నారు. అయితే లోకల్ బాడీ ఎలెక్షన్ కోసం కార్యకర్తలను సిద్ధం చేయడం కోసం, వారిలో ఉత్సాహం నింపడం కోసమే పొంగులేటి ఆ వ్యాఖ్యలు చేసినట్టు వివరణ ఇచ్చారని పీసీసీ చీఫ్ వెల్లడించారు.
ఇక వరంగల్ రాజకీయ అంశాలను తాను గమనిస్తున్నానని తెలిపిన మహేష్ కుమార్ గౌడ్.. కొండా మురళి(Konda Murali) చేసిన వ్యాఖ్యలపై నివేదిక కోరినట్టు తెలిపారు. డీసీసీ, పరిశీలకుడి నుంచి నివేదిక వచ్చాక ఆ వ్యవహారంపై స్పందిస్తానని, అప్పటి వరకు తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. కాగా గురువారం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారు తమ పదవులకు రాజీనామా చేయాలని, సురేఖపై అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే.






