సెప్టెంబరులోనే స్థానిక ఎన్నికలు! PAC గ్రీన్ సిగ్నల్!

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

సెప్టెంబరులోనే స్థానిక ఎన్నికలు! PAC గ్రీన్ సిగ్నల్!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోసహా కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ, మంత్రులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల అంశమే ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మెజారిటీ పీఏసీ సభ్యులు సభ్యులు స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయాన్ని తెలపగా.. సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించినట్టు సమాచారం.

కాగా హైకోర్టు ఇచ్చిన గడువును దృష్టిలో పెట్టుకొని సెప్టెంబరు లోపలే పంచాయితీ ఎన్నికలకు వెళ్లాలని సీఎం డిసైడ్ అయినట్టు వినిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలాక పోవడంతో.. పార్టీ పరంగానైనా బీసీలకు 42 శాతం సీట్లిచ్చి, ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ అధ్యక్షడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొనడం చూస్తే.. వచ్చేనెలలో ఎన్నికలకు వెళ్లడం ఖాయం అనే తెలుస్తోంది.

Next Story