- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ విజయం... ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలు!
by Muthe.Rajitha |
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం తో కాంగ్రెస్ నేతలంతా మంచి జోష్ లో ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లీగల్ సమస్యలు ఎదురవడంతో.. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మొత్తం 50 శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటికే అధికారులు నివేదికను కూడా రెడీ చేసారని సమాచారం. ఈ వ్యవహారంలో బీసీ నేతల నుంచి, బీసీ వర్గాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా వివరణ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కూడా సిద్ధం చేసారని తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గంతో చర్చించి, ఈనెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Next Story






