- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Telangana Local Body Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Telangana Local Body Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC).. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, సంబంధిత అంశాలపై వివరాల కోసం 9240021456 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
కాగా, రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల స్పష్టం చేసింది.






