- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. రిజర్వేషన్లు ఖరారయ్యేది అప్పుడే?
రాష్ట్రంలోని పలు గ్రామాల్లో స్థానిక సంస్థల కోలాహలం కనిపిస్తోంది. వచ్చేనెలలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తూ అధికార పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు గ్రామాల్లో స్థానిక సంస్థల కోలాహలం కనిపిస్తోంది. వచ్చేనెలలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తూ అధికార పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ...
రాష్ట్రంలో ముందుగా ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనేవి పార్టీ గుర్తుల ఆధారంగా జరుగుతాయి. అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొంతవరకు సానుకూలంగా ఉంటాయి. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇదే నిరూపితమైంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అనుకూల ట్రెండ్ సృష్టిస్తాయి. ఆ తరువాత పార్టీ గుర్తు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలు అత్యధిక స్థానాలు సులువుగా గెలుచుకోగులుగుతామని అధికార పార్టీ వర్గాల అంచనా. దీనిలో భాగంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తమ కేడర్‌కు సైతం అధికార పార్టీ నేతలు, మంత్రులు ఇవే సంకేతాలను ఇస్తున్నారు. ఈ ఎన్నికల తరువాత సర్పంచ్ఎన్నికలు వాటి తర్వాత మున్సిపల్ఎలక్షన్స్ నిర్వహిస్తారు.
మూడు విడతల్లో ఎన్నికలు..
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్‌పత్రాల ముద్రణ పూర్తి అయింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది గుర్తింపు ఇవన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈనెలాఖరు కల్లా రిజర్వేషన్‌లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఆ లోగా ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయనుంది. రిజర్వేషన్‌లు అందగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
2019లో మే 6, 10, 14వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఓట్లను మే 27న లెక్కించారు. ఈసారి సైతం మూడు విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను గతంలోనే నిర్వహించాలనుకున్నా... వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. సర్పంచ్‌ల పదవీకాలం 2024 ఫిబ్రవరి తొలివారంలో ముగిసింది. ఆ తర్వాత ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ల పదవీ కాలం ముగిసింది. ఇలా రెండింటికీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి సంవత్సరం పైగా అయింది. ఎన్నికలు నిర్వహిస్తే కానీ కేంద్రం నిధులు ఇవ్వమని చెప్పడంతో ఎలాగైనా వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు మంత్రులతో సీఎం సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఇంటిగ్రేటెడ్కమాండ్కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో ఈ భేటీ జరగనుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రిజర్వేషన్ల అంశం? ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్, పార్టీ పరంగా సన్నద్ధత, ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించేది తదితర వాటన్నంటిపై సీఎం మంత్రులకు అధికారికంగా చెబురారని సమాచారం. రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని. దీంతో మంత్రులందరూ ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తున్నది.






