స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ ఆధిక్యం

by Malleboina Mahesh |   (  Updated:2025-12-14 11:18:01  IST  )

తెలంగాణలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు పూర్తయింది.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ ఆధిక్యం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు పూర్తయింది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, సర్పంచ్ పదవుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 272 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్ (BRS) పార్టీ మద్దతుదారులు 32 స్థానాల్లో విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులు 13 స్థానాలను గెలుచుకున్నారు.

ఇక ఇతర పార్టీలు (OTH), స్వతంత్ర అభ్యర్థులు మద్దతుదారులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో 72 సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు. ఇదిలా మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. కొన్ని ప్రాంతాల్లో కాస్త నెమ్మదిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దీంతో పలితాల వివరాలు ఆలస్యంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి రెండు విడత పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, పార్టీలు, అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

READ MORE ....

రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాల్లో ఆ పార్టీదే జోరు

Next Story