- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుణమాఫీ కానీ రైతుల పక్షాన న్యాయ పోరాటం : మాజీ మంత్రి హరీశ్ రావు
రుణమాఫీ కాని రైతులు పక్షానా మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. అన్యాయానికి గురైన రైతుల కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు హరీశ్ రావు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రుణమాఫీ కాని రైతులు పక్షానా మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. అన్యాయానికి గురైన రైతుల కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో రుణ మాఫీకి అర్హులైన రైతులు 43,363 మంది ఉన్నారు. రుణమాఫీ ప్రయోజనం 20, 514 (47 శాతం) మంది పొందగా.. 22,849 మంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. దీనికి తోడు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ఆ పైన ఉన్న అప్పులను రైతులు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించినట్లు తెలిపారు. ఈ మాట నమ్మి, ఎంతోమంది రైతులు అప్పులు చేసి, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ ఆ అదనపు మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఆశపడితే, ఇంతవరకు నిధులు విడుదల చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
దీంతో బ్యాంకుల నుంచి రైతులపై ఒత్తిడి, వడ్డీల భారం పెరిగిపోయి, రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని వెల్లడించారు. నియోజకవర్గంలోని వేలాది మంది రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. హైకోర్టును ఆశ్రయించానని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ సొమ్మును జమ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేయాలని, బ్యాంకుల నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ద్వారా తమ రైతులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.






