గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో విషాదం.. కో లివింగ్ హాస్టల్లో యువతి సూసైడ్

by Naga Rani Yarlagadda |

కొందరు యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయి.

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో విషాదం.. కో లివింగ్ హాస్టల్లో యువతి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొందరు యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్, లవర్ తో గొడవ వంటి విషయాల్లో ఆలోచన లేకుండా.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్లో మరో దారుణ ఘటన జరిగింది. ఐటీ కారిడార్ లో కో లివింగ్ హాస్టళ్లు కుప్పలు తెప్పలుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇంటికి దూరంగా.. సిటీలో ఉద్యోగాలు చేసే యువత.. తమ ప్రేమికులతో కోలివింగ్ హాస్టళ్లలో కలిసి ఉంటున్నారు. ఈ విషయం ఇంట్లో తెలీకుండా మేనేజ్ చేస్తూ గడిపేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, మనస్పర్థలు వచ్చి.. ఎవరోఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. గచ్చిబౌలిలో ఎలైట్ కో లివింగ్ హాస్టల్లో సాయికుమార్ తో కో లివింగ్ లో ఉంటున్న దుర్గ.. వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

నానక్ రామ్ గూడలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. సాయికుమార్ ఆమెపై పెంచుకున్న అనుమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని సమాచారం. మానసికంగా, శారీరకంగా వేధించడంతో.. భరించలేకపోయిన దుర్గ.. ఎందుకిలా చేస్తున్నావని నిలదీసింది. దీంతో ఇద్దరిమధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఇద్దరూ కలిసి టెర్రస్ పైకి వెళ్లినట్లు విజువల్స్ లో కనిపించగా.. సాయికుమార్ ఒక్కడే వెనక్కి వచ్చినట్లు రికార్డైంది. ఆ వెంటనే ఐదంతస్తుల పైనుంచి దుర్గ కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు అక్కడికి వెళ్లేసరికే దుర్గ మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతురాలి మామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సాయికుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతని వేధింపులే.. దుర్గ ఆత్మహత్యకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. కో లివింగ్ హాస్టల్లో జరిగిన ఈ ఘటనతో ఐటీ కారిడార్ ఉలిక్కిపడింది.

Next Story