- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Liquor: తెలంగాణలో మందు బాబులకు సూపర్ గుడ్ న్యూస్
తెలంగాణలో మందు బాబులకు బీర్ల సరఫరా సంస్థలు(Beer Supply Companies) శుభవార్త చెప్పాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మందు బాబులకు బీర్ల సరఫరా సంస్థలు(Beer Supply Companies) శుభవార్త చెప్పాయి. నిలిచిపోయిన బీర్ల సరఫరాను(Beer) పునరుద్దిస్తున్నట్లు సంస్థలు వెల్లడించాయి. తెలంగాణలో బీర్ల ధరలు(Beer Rates) పెంచాలని, పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ తో బీర్ల సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో బీర్ల నిల్వలు భారీగా పడిపోయాయి. దీనిపై స్పందించిన యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ(United Breweries Company) బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
సెబీ రెగ్యూలేషన్స్ కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(Telangana Beverages Corporation Limited) కి బీర్ల సరఫరాను తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్లు యూబీ సంస్థ(UB Company) ప్రకటించింది. తాము టీజీబీఎల్(TGBL) తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నామని, బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదల వంటి సమస్యలను బేవరేజెస్ కార్పొరేషన్ సమాయనుకూలంగా రి స్పందిస్తామని హామీ ఇచ్చిందని తెలిపింది. ఈ చర్చలు మరింత కాలం కొనసాగుతాయని, వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్యా ప్రస్తుతానికి టీజీబీఎల్ కు బీర్ల సరఫరాను పున ప్రారంభించాలని నిర్ణయించినట్లు యూబీ సంస్థ ప్రకటించింది.






