తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

by Gantepaka Srikanth |

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు(Telangana Liquor Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన కూడా వైన్స్, బార్లు బంద్ ఉండనున్నారు. ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి రేపు ఒక్క మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కరపత్రాలు తయారు చేసుకొని ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా ఓటర్ల కాళ్లకు మొక్కుతూ వేయాలని వేడుకుంటున్నారు. ఒకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story