- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాం కేసు : ఈడీ విచారణకు బుచ్చిబాబు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ బుచ్చిబాబుకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లిక్కర్ స్కాంలో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ విచారించనున్నది.
గతంలో పలుమార్లు వీరిని విచారించిన సందర్భంలో వెల్లడించిన అంశాలపై ఇరువురిని కలిపి అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ స్కామ్‌లో చేతులు మారిన ముడుపుల గురించి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు. రేపు కల్వకుంట్ల కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న సందర్భంగా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై విచారణ ఉత్కంఠంగా మారింది. నేడు ఇరువురిని కలిపి ప్రశ్నించనున్న అధికారులు, రేపు మరోసారి కవిత విచారణ ఎలా ఉండబోతుందని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.






