- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ప్రభావం చూపని గాంధీ జయంతి.. రికార్డు స్థాయిలోమద్యం అమ్మకాలు
దసరా పండుగ నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఎక్సయిజ్ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా పండుగ నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఎక్సయిజ్ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.697 కోట్ల మద్యం విక్రయాలు జరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. గతేడాది దసరా పండుగ సమయంలో 3 రోజుల అమ్మకాలతో పోల్చుకుంటే ఈసారి 60-80 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈసారి దసరా సందర్భంగా రూ. వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తున్నది.
దసరాకు ఫుల్ దావతులు
స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆశావహులు ఓ వైపు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు అనుచరులు, ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగ రోజు ఫుల్ గా దావత్‌లు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే దసరా, గాంధీ జయంతి ఒకే సారి రావడంతో మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు మూడు రోజులు ముందుగానే మద్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26 నుంచి ప్రతి రోజు రూ. 200 కోట్ల వరకు అమ్మకాలు జరిగినట్లు ఎక్సయిజ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ. 333 కోట్ల విక్రయాలు జరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న రూ. 402 కోట్ల విక్రయాలు జరగ్గా, ఆ తర్వాత సెప్టెంబర్ 30నే ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సయిజ్ అధికారులు చెబుతున్నారు.
మూడు రోజుల అమ్మకాలు ఇలా..
సెప్టెంబర్ 29 : రూ.278 కోట్లు
సెప్టెంబర్ 30 : రూ. 333 కోట్లు
అక్టోబర్ 1 : రూ.86 కోట్లు
సెప్టెంబర్లో 7.5 శాతం అధిక అమ్మకాలు..
గతేడాదితో పోల్చుకుంటే ఈసారి సెప్టెంబర్లో 7.5 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. 2024 సెప్టెంబర్‌లో రూ.2,838 కోట్ల అమ్మకాలు జరగ్గా, 2025 సెప్టెంబర్‌లో రూ. 3,048 కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది దసరా సందర్భంగా జరిగిన అమ్మకాల్లో 8.5 శాతం పెరుగుదల కనిపించినట్లు ఎక్సయిజ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి లిక్కర్ సేల్స్ పెరగ్గా.. బీర్ సేల్స్ తగ్గడం గమనార్హం..
సంవత్సరం నెల మొత్తం అమ్మకాలు లిక్కర్ బీర్లు
పెద్ద ఎత్తున అక్రమ మద్యం పట్టివేత..
దసరా పండుగ నేపథ్యంలో ఎక్సయిజ్ శాఖ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోకి విదేశీ మద్యం, ఇతర రాష్ట్రాల మద్యం రాకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్న 1,258 మద్యం బాటిళ్లను ఎక్సయిజ్ స్పెషల్ టీమ్ పట్టుకున్నది. వాటి విలువ సుమారుగా రూ.70 లక్షల వరకు ఉంటుంది.






