- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కారుకు లిక్కర్ కంపెనీల అల్టిమేటం
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలు మరోసారి అల్టిమేటం జారీ చేసాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలు మరోసారి అల్టిమేటం జారీ చేసాయి. పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే లిక్కర్ ఉత్త్పతి ఆపేస్తామని హెచ్చరించాయి. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
సర్కారు నుంచి ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. ఇదే జరిగితే కొత్త సంవత్సరానికి మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Next Story






