మందుబాబులకు అలర్ట్..నేడు వైన్ షాపులు బంద్!

by velandi.Saikiran |

మందుబాబులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

మందుబాబులకు అలర్ట్..నేడు వైన్ షాపులు బంద్!
X

దిశ‌, వెబ్ డెస్క్: మందుబాబులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇవాళ శ్రీరామ నవమి పండుగ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జంట నగరాలలో శ్రీరామ నవమి వేడుకలు చాలా గ్రాండ్ గా సాగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మతపరమైన ఘర్షణలు జరిగే ప్రమాదాలు ఉంటాయి.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు విధించింది పోలీస్ శాఖ. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలతో పాటు స్టార్ హోటల్స్ లోని బార్లలో కూడా మద్యం విక్రయాలను ఆపేయాలని ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ డ్రై డే నోటిఫికేషన్ విడుదల చేసింది పోలీస్ శాఖ. ఇక తమ ఆదేశాలు కాదని ఎవరైనా చట్టానికి విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే, చట్టపరమైన చర్యలు ఉంటాయని సజ్జనాల్ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పోటెత్తిన భక్తులు

శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో భక్తుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రధాన ఆలయం, గోపురం, కళ్యాణ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. ఈ నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరారు భక్తులు. మాడా వీధులన్నీ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. అటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహిస్తున్నారు.

Next Story