కాసేపట్లో ఉప్పల్ స్టేడియంకు లియోనెల్ మెస్సి.. ఈవెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-13 11:56:00  IST  )

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం

కాసేపట్లో ఉప్పల్ స్టేడియంకు లియోనెల్ మెస్సి.. ఈవెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి సరిగ్గా సాయంత్రం 4.30కి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా 100 మంది ప్రముఖులతో తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యకమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 8.25కు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. 8.33కు ఈవెంట్ నిర్వాహకుడు అనుపమ్ రెడ్డి గోల్‌కీపర్‌ పెనాల్టీ షూటౌట్‌లో పాల్గొంటారు. అనంతరం 8.38 గంటలకు మెస్సీ స్టేడియం చుట్టూ పరేడ్ వాక్ చేస్తూ అభిమానులకు కరతాళధ్వనుల మధ్య అభివాదం చేస్తారు. ఈ పరేడ్‌లో మెస్సితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సువారెజ్, డి.పాల్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. 8.48 గంటలకు వేదికపై అధికారిక పరిచయ కార్యక్రమం ఉంటుంది. మధ్య మెస్సి, ఆయన కుడి వైపున సీఎం రేవంత్ రెడ్డి, ఎడమ వైపున రాహుల్ గాంధీ నిలబడతారు. వారి పక్కన రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్, వినయ్ కొట్రా, సైనాథ్ గౌడ్, తిదితరులు వేదికపై ఉంటారు.

8.51 గంటలకు మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్లు, జట్టు యజమానులతో ఫోటోలు దిగుతారు. 8.53 గంటలకు ‘గోట్’ కప్‌ను ముఖ్యమంత్రి లియోనెల్ మెస్సీకి అందజేశాక, మెస్సీ అదే ట్రోఫీని పాల్గొన్న జట్టుకు అందిస్తారు. అనంతరం 8.54 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని ఘనంగా సత్కరిస్తారు. 8.55 గంటలకు పార్థవి రెడ్డి లూయిస్ సువారెజ్‌ను, 8.56 గంటలకు వినయ్ కొట్రాను, రోడ్రిగో డి పాల్‌ను సైనాథ్ గౌడ్‌ సన్మానిస్తారు. 8.57 గంటలకు ఫైనల్ సిగ్నీచర్ కార్యక్రమం ఉంటుంది. 8.58 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆ వెంటనే రాహుల్ గాంధీ తన సందేశాన్ని ఇస్తారు. రాత్రి 9 గంటలకు వేదికపై ఉన్న ప్రముఖులంతా స్టేడియం నుంచి నిష్క్రమిస్తారు. 9.05 గంటలకు డిస్పర్సల్ ప్రకటనలు.. 9.10 గంటలకు కార్యక్రమానికి నిర్వాహకులు అధికారిక ముగింపును పలుకుతారు.

Next Story