- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూసీ పునరుజ్జీవానికి లైన్ క్లియర్.. రూ.4,100 కోట్ల రుణానికి ADB బ్యాంకు అంగీకారం
మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సైతం సూత్రప్రాయంగా అనుమతించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ అధికారులు సమావేశమైనట్లు, నిధులు ఇచ్చేందుకు ఏడీబీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏడీబీతో అధికారులు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అందుకు ఏడీబీ ప్రతినిధి బృందం మొదటి దశలో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణం, పర్యాటకం వంటి అంశాల గురించి ఆరా తీసినట్టు ఎంఆర్డీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
రెండో విజిటింగ్‌తో..
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు మొదట ప్రపంచబ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని చూసినప్పటికీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఏడీబీ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రానికి సూచించింది. మూసీ ప్రాజెక్టు వివరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు వారికి వివరించగా, పర్యావరణపరంగా ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో నిధులిచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. నదికి ఇరువైపులా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్లాన్లు రూపొందించిన ప్రభుత్వం.. వివిధ ప్రాంతాల నుంచి మూసీలో వచ్చి కలుస్తున్న వరద, మురుగునీటిని శుద్ధి చేయడానికి మూసీ పొడవునా ఆయా ప్రాంతాల్లో నిర్మించే ఎస్టీపీలకు పంపించనున్నారు. వీటన్నింటిని ఏడీబీ ప్రతినిధులు పరిశీలించినట్టు అధికారులు చెబుతున్నారు. నవంబర్ మొదటి వారంలో రెండో సారి విజిట్ చేయనున్నారు. ఆ తర్వాత లోన్ ప్రాసెస్ చేసే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
రూ.5,863 కోట్లతో ప్రతిపాదనలు..
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, భూమి ఉపయోగ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ల ఆధారంగా ప్రాజెక్టు తుది డీపీఆర్ తయారు చేస్తున్నారు. దీన్ని డిసెంబర్2025 వరకు పూర్తిచేయాలని అధికారులు చెబుతున్నారు. జనవరి 2026 నుంచి ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. మూసీ అభివృద్ధికి మొదటగా రూ.5,863 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ఏడీబీ నుంచి రూ.4,100 కోట్ల రుణంతోపాటు ప్రభుత్వ వాటాగా రూ.1,763 కోట్లతో కలిపి మొత్తం రూ.5,863 కోట్లతో కొన్ని ప్రతిపాదనలు చేసింది. వీటితోపాటు పర్యాటకం, వాణిజ్య సముదాయాల నిర్మాణం, రహదారులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వినోద కేంద్రాల ఏర్పాటు వంటి వాటి కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోపాటు పలు ప్రైవేటు ఏజెన్సీలు, అద్దెలు, లీజులు, ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
734 ఎకరాల భూములు..
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా 734 ఎకరాల భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్‌పూర్, రాజేంద్రనగర్ మండలానికి చెందిన ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఉన్న టీఈఈఆర్‌ఎల్, ఐఐపీహెచ్, ఇతర సంస్థలకు కేటాయించిన భూములతోపాటు శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ పరిధిలో హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు. ఈ సంస్థలకు ఫ్యూచర్ సిటీలో భూములను కేటాయించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద 100ఎకరాల్లో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం 100 ఎకరాలు కావాలని రక్షణశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే 44 ఎకరాల భూములు ఇవ్వడానికి మిలటరీ అధికారులు అంగీకరించినట్టు సమాచారం. మిగిలిన భూముల కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన విషయం విదితమే. హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, నాగోల్‌లో శిల్పారామం, జాతీయ జెండా ఏర్పాటు చేసిన ప్రాంతాలను మార్కీ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.






