రెండు కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-11 10:02:08  IST  )

రెండు కీలక బిల్లులకు తెలంగాణ గవర్నర్ ఆమోదం లభించింది.

రెండు కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు కీలక బిల్లులను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. మొత్తం నాలుగు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే అందులో రెండు బిల్లులను ఆమోదించారు. అందులో జిన్నారం మున్సిపాలిటీలో గ్రామాల చేర్చే పంచాయతీ, మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం లభించగా, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన చట్టం పెండింగ్‌లోనే పెట్టారు. దీంతో ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆమోదించిన రెండు బిల్లులకు సంబంధించి అతి త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

కాగా, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, పురపాలికలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి... బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ బిల్లులు రెండింటిని సెప్టెంబర్ 2న రాజ్ భవన్‌ (Raj Bhavan)కు పంపిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న అసెంబ్లీ (Assembly)లో, సెప్టెంబర్ 1న శాసన మండలిలో ఆ రెండు బిల్లులు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

Next Story