కండువా మార్చినట్లు.. పార్టీలు మారుతున్నారు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

by Malleboina Mahesh |   (  Updated:2023-10-08 10:49:30  IST  )

భుజం మీద కండువా మార్చినంత సులభంగా రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

కండువా మార్చినట్లు.. పార్టీలు మారుతున్నారు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భుజం మీద కండువా మార్చినంత సులభంగా రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఇవాళ హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్‌ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాల్లో కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని, అది మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు బ్యాక్‌ గ్రౌండ్‌ అవసరం లేదని, అందులో రాణించేందుకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని సూచించారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిపి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలని ఆకాంక్షించారు.

Next Story