- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
హత్య కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.6వేలు జరిమానా విధిస్తూ బుధవారం సిరిసిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ కీలక తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : హత్య కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.6వేలు జరిమానా విధిస్తూ బుధవారం సిరిసిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ కీలక తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ముస్తాబాద్ మండలం బద్నకల్ గ్రామానికి చెందిన కస్తూరి రాంరెడ్డి, కస్తూరి కరుణాకర్ రెడ్డి ఇద్దరి మధ్య వ్యవసాయ భూ వివాద సమస్య ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా కస్తూరి కర్ణాకర్ రెడ్డిని చంపాలని కస్తూరి రాంరెడ్డి, అతని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం.. డిసెంబర్ 27, 2020న కరుణాకర్ రెడ్డి తన పొలంలో పని చేసుకుంటుండగా.. కస్తూరి రాంరెడ్డి అతని భార్య మంజుల, ఇద్దరు కుమారులు వెంకటేశ్ , మహేష్ లు అక్కడికి చేరుకుని నలుగురు కలసి కరుణాకర్ రెడ్డి ని గొడ్డలితో నరికి, కట్టెలతో కొట్టి హత్య చేశారు.
ఈ కేసులో మృతిని సోదరి పద్మ పిర్యాదు మేరకు ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందుతులను రిమాండ్ కి తరలించారు. అప్పటి సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ఈకేసు విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు రాజేందర్ నాయక్, నవీన్ లు కోర్టులో 14 మంది సాక్షులను ప్రవేశపెట్టగా.. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. 6000/- జరిమానా విధించినట్టు ఎస్పీ తెలిపారు.
నేరం చేస్తే శిక్షలు తప్పవు
సమాజంలో నేరం చేసిన వారు ఎవ్వరు శిక్ష నుంచి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఎస్పీ తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంట్టున్నట్టు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అశ్విన్, అప్పటి సీఐలు సర్వర్, ఉపేందర్, మొగిలి, సీఎంఎస్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు, కోర్ట్ మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, కోర్టు కానిస్టేబుల్ రాజేందర్, దేవేందర్, ప్రస్తుత సీఐ నాగేశ్వరరావు, ఎస్.ఐ గణేష్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






