- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ లోఫర్ భాషను మార్చుకోవాలి: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, రియాజ్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ యూనివర్శిటీ భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే హారీష్ రావులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ యూనివర్శిటీ భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే హారీష్ రావులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మండిపడ్డారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, చనగాని దయాకర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ సెంట్రల్ యూనిర్శవటీలు కేంద్ర ఆజమాయిషీ ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం ఉండదన్నారు. భూముల వివరాలను రంగారెడ్డి కలెక్టర్ సాధారణ పరిపాలన భాగంగానే ఉత్తర్వులు ఇచ్చారని, ఇట్లాంటి అంశాలు పాలన పరమైన ప్రక్రియలో భాగమన్నారు. ఈ భూముల వినియోగంపై యూనివర్శిటీ స్పందించడంతో విషయం ముగిసిందని, యూనివర్శిటీ సంబంధం లేని వారితో గోబల్స్ ప్రచారం చేస్తున్నారని రియాజ్ ఆరోపించారు.
కేటీఆర్ మాటలు హుందాగా ఉండాలే కానీ, లోఫర్ గా మాట్లాడొద్దని ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎంపై కేటీఆర్ కామెంట్లు.. ఆయన తన లోఫర్ భాషను మార్చుకోవాలని రియాజ్ హితవు పలికారు. ఆ భూములు కేంద్రం పరిధిలో అభివృద్ది కోసం వినియోగిస్తారని, సెంట్రల్ యూనివర్శిటీ భూములను కోర్టులో గెలిపించడంలో తమ ప్రభుత్వానిదే ఘనత అని ఆయన తెలిపారు. విద్యను నిర్వర్వం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, విద్యా కమిషన్ వేసిన ఘనత తమదన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై అబద్దాలు చెప్పొద్దని, ఆ యూనివర్శిటీ అభివృద్ధి కోసమే భూములను వాడుకుంటామని రియాజ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం, వారికి విద్యను కల్పించడం కోసం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతులు చిక్కడపల్లిని రాజకీయ అడ్డగా మార్చాకుంటున్నారు : టీపీసీసీ జనరల్ సెక్రటరీ, చనగాని దయాకర్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీపై కలెక్టర్ వివరణను బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పు దారి పట్టించారని, రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు యూనివర్సిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, చనగాని దయాకర్ స్పష్టం చేశారు. మౌలానా ఉర్ధూ యూనివర్సిటీని కేటీఆర్ తన రాజకీయం కోసం వాడుకున్నారని, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు సమాచారంతో పౌర సమాజం, విద్యార్థి లోకం ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్యంతోనే ప్రభుత్వ యూనివర్సిటీలకు రక్షణగా ఉంటుందని, రేవంత్ రెడ్డి పాలనలో ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాల కల్పన జరిగిందని, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చిక్కడపల్లిని రాజకీయ అడ్డగా మార్చారని, నిరుద్యోగ యువత ప్రతి పక్షాల ఊబిలో కాకుండా వాస్తవాల్ని గమనించాలని దయాకర్ విజ్ఞప్తి చేశారు.






