- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్‌రెడ్డికి రైతు కమిషన్సభ్యుల లేఖ
రాష్ర్టంలో మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని రైతు కమిషన్కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని రైతు కమిషన్కోరింది. శనివారం కమిషన్‌చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భూమి సునీల్ లేఖ రాశారు. ఎన్నడూ లేనివిధంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వివిధ దశల్లో వున్న పంటలు తుఫాన్ కారణంగా దెబ్బతిన్నాయని, రైతులకు ఆదుకొని అండగా నిలవాలని కోరారు. ఈ సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలు బాగా పండినట్లు ఈ వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల వివిధ దశలో వున్న పంటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం నిర్వహకులు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఆదిలాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలలో కొంత సోయాబీన్ పంట చేతికొచ్చింది.
దాన్ని మార్క్ఫెడ్ద్వారా కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. రైతులు ఏరి ఇండ్లలో నిల్వ ఉంచుకున్న పత్తికి తేమ శాతం మినహాయించి సీసీఐ తూకం వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆర్ధిక సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఖరీఫ్ పంట కాలానికి రైతులు పెట్టుబడి కింద తీసుకున్న ఋణాలు, రీ షెడ్యూల్ చేయవలసిన అవసరం ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన భాద్యతగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణాలో ఉన్న విపత్కర పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరాలని సూచించారు. తడిసి ధాన్యాన్ని కోళ్ళు ఫారాల వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారని, దీనికి తగిన ఏర్పాటు చేయాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశనగ పంట భారీగా నష్టం అయింది. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం పెసర, మినుము, కుసుమ, నువ్వులు మొదలైనవి విత్తనాలు సబ్సీడీ పైన సరఫరా చేయాలని కోరారు.






