కలిసికట్టుగా పనిచేద్దాం... టీడీపీకి పునర్ వైభవం తెద్దాం

by Disha Web |
కలిసికట్టుగా పనిచేద్దాం... టీడీపీకి పునర్ వైభవం తెద్దాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అందరం కలిసికట్టుగా పనిచేద్దాం... టీడీపీకి పునర్ వైభవం తీసుకొద్దామని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అన్నారు. పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు అయిందని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. అభిప్రాయ బేధాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేద్దామన్నారు.

హైదరాబాద్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతోనే నేడు దేశానికే తలమానికంగా మారిందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపు నిచ్చారు. సభ్యత్వాలను గ్రామస్థాయి నుంచి చేద్దామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ఏ ఆపద వచ్చినా వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్, పద్మావతి, ప్రదీప్ చౌదరి, జీవీజీ నాయకుడు, ఆరీఫ్, లత, శ్రీపతి సతీష్, ఎంకే బోస్ , సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed