కృష్ణ, గోదావరి నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

కృష్ణ గోదావరి నీటి పంపకాల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కృష్ణ, గోదావరి నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, హుజూర్ నగర్ : కృష్ణ గోదావరి నీటి పంపకాల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం లోని మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణ గోదావరి జలాల నీటి పంపకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కోరుకునే పరిస్థితి లేదని నీటి పంపకాల విషయంలో ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 85% జనాభాకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డును పంపిణీ చేశామని తెలిపారు. 71 లక్షల మెట్రిక్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని గతంలో ఏ ప్రభుత్వం ఇలా కొనుగోలు చేయలేదని తెలిపారు. రైతులందరికీ బోనస్ గా 19 వేల కోట్లను అందించామన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు.

Next Story