ఇక పనిలోకి వెళదాం బాయ్స్.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-31 08:11:54  IST  )

పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై 3 నెల్లలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా రియాక్ట్ అయ్యారు.

ఇక పనిలోకి వెళదాం బాయ్స్.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై 3 నెల్లలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా కాపాడినందుకు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని, ఒక వేళ ఎమ్మెల్యే పార్టీ మారితే వెంటనే సభ్యత్వాన్ని ఆటోమెటిక్‌గా రద్దు చేయాలని పంచ‌న్యాయ్‌లో వాదించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నా అంటూ సెటైర్లు వేశారు.

మిస్టర్ గాంధీతో పాటు ఆయన పార్టీ స్పీకర్ పదవితో భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి ఉపయోగించుకోరని తాను ఆశిస్తున్నానని కామెంట్ చేశారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అక్రమంగా కాంగ్రెస్‌ (Congress)లో చేరి ప్రతిరోజూ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. ఈ విషయంలో తేల్చడానికి ఏముందని ప్రశ్నించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ లీగల్ టీమ్స్, బీఆర్ఎస్ సైనికులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము అనుకన్నట్లుగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందని.. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని.. పనిలోకి వెళదాం బాయ్స్! సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read More: Addnaki Dayakar: నాడు విధ్వంసం చేసి నేడు చిలకపలుకులా?.. బీఆర్ఎస్ పై అద్దంకి ఫైర్

Next Story