బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తాడోపేడో తేల్చుకుందాం.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీసీలకు 42 రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుందామని బీసీ సంఘాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత్ రావు పిలుపునిచ్చారు.

బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తాడోపేడో తేల్చుకుందాం.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుందామని బీసీ సంఘాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత్ రావు పిలుపునిచ్చారు. ఈ రోజు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే విధంగా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలకు లేఖ రాశానని తెలిపారు. బీసీ బిల్లు అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు మేలు జరగాలంటే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల బీసీ సంఘాలు హాజరు కావాలన్నారు. బీసీ బిల్లు కోసం ఢిల్లీలో ఇక తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌పై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రతిపాదన చేయడం రాహుల్ గాంధీ చేసినట్టు తెలిపి, దాన్ని అభినందనీయమని వీహెచ్ కొనియాడారు.

Next Story